ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజతో వెంకటేశ్ నెక్స్ట్ మూవీ 'ఈ నగరానికి ఏమైంది'?

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 26, 2017, 12:05 PM

సురేశ్ ప్రొడక్షన్స్  ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు కొన్ని సినిమాలను సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులు మూడు నాలుగు లైన్లో వున్నాయి. వాటిలో ఒక సినిమా కోసం ' ఈ నగరానికి ఏమైంది'? అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఆల్రెడీ ఈ మాట జనంలో బాగా నానుతోన్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ టైటిల్ వెంకటేశ్ సినిమా కోసమేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. వెంకటేశ్ కథానాయకుడిగా దర్శకుడు తేజ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను వచ్చేనెల 16వ తేదీన లాంచ్ చేయనున్నారు. వెంకటేశ్ సరసన కథానాయికగా అనుష్క చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఈ సినిమా తరువాత తేజ ఎన్టీఆర్ బయోపిక్ చేయనుండగా, వెంకటేశ్ ఓ మల్టీ స్టారర్ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa