ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘హనుమాన్’ . సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా.. ఇంకా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న జీ5 తో పాటు మేకర్స్ కూడా ఇదిగో, అదిగో అంటున్నారు కానీ.. ఇంత వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. తాజాగా జీ5 ఓటీటీ సంస్థ.. ‘హనుమాన్’ ఓటీటీ విడుదల పై చేసిన ట్వీట్.. ఓటీటీ ప్రేక్షకులను మరింతగా డిజప్పాయింట్ చేస్తోంది. ఈ ట్వీట్లో ‘హనుమాన్’ తెలుగు వెర్షన్‌కు సంబంధించి అప్డేట్ ఇస్తున్నట్లే ఇచ్చి.. మళ్లీ ఊరించే ప్రయత్నం చేశారు. అతి త్వరలో ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అంటూ జీ5 సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన వారంతా మరోసారి నిరుత్సాహానికి గురవుతున్నారు. కారణం.. ఇదే సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఏయే ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతుందో.. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో.. డేట్, టైమ్‌తో సహా ప్రకటించారు. కానీ, హిందీ మినహా ఇతర వెర్షన్స్‌లో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదలకు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు కూడా నెటిజన్లు, ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.