టాలీవుడ్ యంగ్ అండ్ ప్యాషనేట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన బ్లాక్ బస్టర్ హనుమాన్ విడుదలైన తర్వాత చర్చనీయాంశంగా మారింది. 5 భారతీయ భాషల్లో విడుదలైన ఈ సూపర్ హీరో చిత్రం ఇటీవల 25 సెంటర్స్ లో 100 రోజుల థియేట్రికల్ రన్ జరుపుకుంది. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు ఈ సినిమాని 5 అంతర్జాతీయ భాషలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రం చివరికి 5 భారతీయ భాషల్లో మాత్రమే విడుదలైంది మరియు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది.
దాదాపు 4 నెలలు కావస్తున్నా, హను-మాన్ ఇంటర్నేషనల్ భాషల్లో విడుదల చేయడం గురించి ప్రశాంత్ వర్మ ఎలాంటి అప్‌డేట్‌లు వెల్లడించలేదు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన 100 రోజుల వేడుకలో ఆయన దాని గురించి ఏమీ చర్చించలేదు. హను మాన్‌ను అంతర్జాతీయ భాషలలో విడుదల చేయాలనే ఆలోచనను ప్రశాంత్ వర్మ పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తోంది. అయితే చిత్ర నిర్మాత స్పందన కోసం వేచి చూడాల్సిందే.