కోలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో శింబు సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు కూడా బాలీవుడ్ హీరోయిన్లు కానుండటం గమనార్హం. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్‌లైఫ్’ చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్న శింబు ఆ తర్వాత కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై తన 48వ చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న గ్లిమ్స్‌ను కూడా గతంలోనే విడుదల చేశారు.2020లో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన కనులు కనులు దోచాయంటే వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను రూపొందించిన దేశింగు పెరియస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో హీరో, విలన్ పాత్రల్లో శింబు కనిపించనుండడం విశేషం. అయితే ఇందులో నటించనున్న కథానాయికల విషయంలోగత కొంత కాలం నుంచి చాలా వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఇందులో బాలీవుడ్ నటి కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లను నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు దృష్టి సారించినట్టు సమాచారం. ఈ ఇద్దరు హీరోయిన్లలో కియారా అద్వానీ ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న‘గేమ్ ఛేంజర్’లో కథానాయికగా నటిస్తుండగా, జాన్వీ కపూర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శింబు చిత్రంలో నటించేందుకు వీరిద్దరూ అంగీకరిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.ఇదిలాఉండగా ప్రస్తుతానికి ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే పేర్లు కన్ఫమ్ అయినట్టు న్యూస్ హల్చల్ చేస్తోంది. మరి ఇందులో ఏది నిజమో, ఎవరు నటిస్తున్నారో కొద్ది రోజులైతే గానీ మనకు తెలియదు. BLOOD and BATTLEగా పిలవబడుతున్న ఈ సినిమా రెండు పార్టులుగా ఉంటుందని, కమల్ హసన్ చిన్న కెమియోలో కనిపించనున్నట్లు సమాచారం. ఆగష్టులో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa