ఏపీ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ సాగనుందని సమాచారం. బ్లాక్ బస్టర్ సినిమా కేజీఎఫ్ లాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చిన వారిలో సాయి ధరమ్ తేజ్ మంచి స్దాయికి వెళ్లారు.మొదట్లో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకుని దూసుకుపోయాడు. రేయ్ మూవీతో మొదటగా నటించిన సాయి ధరమ్ తేజ్ వరస హిట్స్ కొట్టారు. అయితే ఈ మద్యన కాస్త స్పీడు తగ్గింది. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష మూవీతో భారీ హిట్ కొట్టాడు. అనంతరం మామయ్య పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన బ్రో సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ సంపత్ నందితో గాంజా శంకర్ మూవీ అనుకున్నారు. ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు తెలిసింది. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు ఓ కొత్త చిత్రం సైన్ చేసినట్లు సమాచారం. టైటిల్ గా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది.
రోహిత్ అనే కొత్త దర్శకుడికి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ వినికిడి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిరంజన్ రెడ్డి నిర్మించనున్నారు. సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి రూపొందించనున్నారని టాక్. ఏపీ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ సాగనుందని సమాచారం. బ్లాక్ బస్టర్ సినిమా కేజీఎఫ్ లాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. సంబరాల ఏటి గట్టు- S.Y.G అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వినికిడి. పీరియడ్ కథ అని, మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలిసింది. ఇక రీసెంట్ గా సాయి తేజ్ తన పేరు కూడా మార్చుకున్నారు. రీసెంట్ గా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న షార్ట్ ఫిల్మ్ సత్య (Satya) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేదికగా తన పేరు మార్చుకున్నట్లు సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు. సాయి తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) అని మార్చుకున్నట్లు తెలిపాడు. తన తల్లి పేరు అయిన 'దుర్గ'ను తన పేరులో యాడ్ చేసుకున్నట్లు వివరించాడు.
ఇలా తన తల్లి ఎప్పుడూ తనతోనే ఉన్నట్లు ఉంటుందనే భావనతో ఇలా పేరును యాడ్ చేసుకున్నట్లు సాయి తేజ్ తెలిపాడు. "నా పేరులో మా నాన్న గారి పేరు ఉంది. అలాగే మా అమ్మ గారి పేరు కూడా ఉండాలని ఇలా సాయి దుర్గ తేజ్ అని పెట్టుకున్నాను" అని సాయి తేజ్ చెప్పుకొచ్చాడు. కాగా సాయి తేజ్ వాళ్ల అమ్మ పేరు విజయ దుర్గ అని తెలిసిందే. అయితే సాయి తేజ్ ఇలా పేరు మార్చుకోవడం ఇది రెండోసారి.గతంలో తన స్క్రీన్ నేమ్‌ను ధరమ్ తీసేసి సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. కానీ, ఇప్పటికీ చాలా మంది ఈ సుప్రీమ్ హీరోను సాయి ధరమ్ తేజ్ అనే పిలుస్తుంటారు. మరి ఇప్పుడైనా సాయి దుర్గ తేజ్ అని ఎంత మంది పిలుస్తారో చూడాలి.