8 మే 1995న తమిళనాడులోని ఈరోడ్ లో జన్మించింది అందాల తార ఐశ్వర్య మీనన్. ఈమె కుటుంబం కేరళలోని చేందమంగళని చెందినది. తమిళనాడులోని ఈరోడ్‌లో వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ బ్యూటీ. బాలాజీ మోహన్ దర్శకత్వంలో కధలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.తర్వాత తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం యాపిల్ పెన్నేలో తొలిసారిగా కోమలవల్లి అనే పేరుతో కథానాయకిగా నటించింది. 2013లో M.S రమేష్ దర్శకత్వంలో దావసల అనే చిత్రంలో కథానాయకిగా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.ఐశ్వర్య మీనన్ మాన్‌సూన్ మ్యాంగోస్ అనే లో సపోర్టింగ్ రోల్ లో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 2023లో యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం స్పైలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ మూవీలో నటించింది ఈ భామ.ప్రస్తుతం తెలుగు యంగ్ హీరో కార్తియకకి జోడిగా భజే వాయు వేగం అనే చిత్రంలో నటిస్తుంది. తెలుగులో ఈ వయ్యారి ల్లో నటించే అవకాశం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవడం ఖాయం.