కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు మోహన్ లాల్ వయనాడ్ లోని ప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భారీ విరాళం ప్రకటించారు. వయనాడ్ బాధితులకు పునరావాసాల కోసం మోహన్ లాల్ ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరింత ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa