డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్ కి తాత్కాలికంగా ఎన్టీఆర్ 31 అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఇండస్ట్రీ ప్రముఖులు దిల్ రాజు, హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రణతి ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేసి కెమెరా స్విచ్చాన్చే శారు. సినిమా విడుదల తేదీని ప్రకటించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆశ్చర్యపరిచారు మూవీ మేకర్స్. ఎన్టీఆర్ 31 జనవరి 9, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇది సంక్రాంతి సీజన్లో విడుదల కానున్న మొదటి చిత్రం. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాయి.