హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ రేపు జరుగనున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ నటిస్తుంది. ఈ చిత్రం పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై భారతదేశం యొక్క సుదీర్ఘ ఆదాయపు పన్ను దాడి ఆధారంగా రూపొందించబడింది. టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రం అజయ్ దేవగన్ యొక్క సూపర్ హిట్ రైడ్ యొక్క అధికారిక రీమేక్.