స్విట్జర్లాండ్‌లో జరిగిన 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అద్భుతమైన అప్డేట్ను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో, ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు ప్రతిష్టాత్మక పార్డో అల్లా కారియరా అవార్డుతో సత్కరించారు. సుజోయ్ ఘోష్‌తో కలిసి 'కింగ్' అనే టైటిల్‌తో ఆయన చేయబోయే సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఏంటంటే. ఈ సినిమా టీమ్ ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో నటుడు మాట్లాడుతూ... తాను ఏజ్ సెంట్రిక్ మూవీ చేయాలనుకుంటున్నట్లు మీడియాతో పేర్కొన్నాడు మరియు సుజోయ్ ఘోష్‌కి అదే చెప్పాడు. అప్పుడే దర్శకుడు కింగ్ సబ్జెక్ట్‌తో నటుడిని కలిసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం నటుడు తన పాత్ర కోసం బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మ మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.