నేడు అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నటి జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవికి విషెస్ తెలిపింది.జాన్వీ తన తల్లి శ్రీదేవితో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. జాన్వీకి తల్లి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. తల్లితో ఎంతో స్నేహంగా ఉండేది. శ్రీదేవితో కలిసి షూటింగ్స్ కూడా వెళ్లేది జాన్వీ. శ్రీదేవి కూడా తన కూతురు జాన్వీని పెద్ద హీరోయిన్ ని చేయాలని కోరుకుంది.