కన్నడ సినిమా 'కాంతారా' కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా నటుడు కథానాయకుడిగా కూడా నటించారు. కాంతారా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రముఖ ఛానెల్ స్టార్ మా మూవీస్ ఛానల్ లో ఆగష్టు 17, 2024న సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించనుంది. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ బ్లాక్‌బస్టర్‌లో సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa