మహేష్ బాబు 26వ చిత్రంగా తెరకెక్కబోతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో లేడీ సూపర్ స్టార్‌గా తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించడం విశేషం. తను ఈ సబ్జెక్ట్ వినిపించగానే నచ్చి చేయడానికి అంగీకరించిన విజయశాంతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు అనీల్. ఈ సందర్భంగా విజయశాంతి పంపిన ప్రెస్ నోట్‌ని మీడియాకు విడుదల చేసారు.
నా తెలుగు మొదటి సినిమా ‘కిలాడి కృష్ణ’ సూపర్ స్టార్ కృష్ణ గారితో చేశాను. ఆ తరవాత 180 సినిమాల్లో నటించాను. నా రాజకీయ జీవితంలో 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అని విజయశాంతి తన ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa