వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. సెప్టెంబర్ 7, 2024న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా వాయిదా పై స్పందిస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. వాయిదాకి క్వాలిటీ నే కారణం అని మంచి క్వాలిటీ తోనే సినిమాని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు అందుకే విడుదల వాయిదా వేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాని అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.