మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినీ నేపథ్యం లేకుండా సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి తెలుగు చలన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా గతిని మార్చిన హీరో. కెరీర్ తొలినాళ్లలో అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రారాజు. ఎంతో మందికి స్పూర్తి మెగాస్టార్ చిరంజీవి. తెలుగు ప్రజలకు అన్నయ్య. ఇవాళ ఆయన పుట్టిన రోజు.
చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థాయి వేరు.. మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ‘స్వయంకృషి’తో నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాలతో పోటీ పడిన ఏకైన నటుడు ఆయనే. మూడు తరాల అభిమానులను సంపాదించిన నటుడు కూడా ఈయనే. మెగా ప్రస్థానంలో చిరంజీవి నటన, డాన్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన చిత్రాల్లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. తొలినాళ్లలో ‘సుప్రీమ్ హీరో’గా పేరొందిన చిరు ఆ తర్వాత ‘మెగాస్టార్’గా విశేష క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు. ఆ చిత్ర నిర్మాత కె.ఎస్. రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. చిరు ‘సుప్రీమ్ హీరో’గా కనిపించిన చివరి చిత్రం ‘ఖైదీ నంబరు 786’. సుప్రీమ్ హీరో, మెగాస్టార్.. ఈ రెండింటిపైనా పాటలు రావడం విశేషం.