సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ డీమోంటే కాలనీ 2 సినిమాలో అరుళ్నితి, ప్రియా భవాని శంకర్ మరియు అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ఆగష్టు 15న విడుదలైంది. ఈ చిత్రానికి అభిమానులు మరియు విమర్శకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆగస్ట్ 23న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ని నైజాం రైట్స్ ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేసింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ ల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సీక్వెల్‌కు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. తాజాగా ఇపుడు ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఛానల్ ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించనుంది. జ్ఞానముత్తు పట్టరై మరియు వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa