దర్శకధీరుడు రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతోంది. మహేష్ ఆల్రెడీ తన మేకోవర్ ని మార్చుకోవడం మొదలు పెట్టారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ చిత్రం ఉండబోతోంది. మహేష్ చివరి చిత్రం గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం గడుస్తోంది. అయినా ఇంతవరకు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రారంభించలేదు. ఆగష్టులో అంటూ ఊహాగానాలు వచ్చాయి. సెప్టెంబర్ కూడా వచ్చేస్తోంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉంది. కానీ జక్కన్న పెద్ద స్కెచ్ వేశారట. ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ అనిపించేలా.. హాలీవుడ్ చిత్రాలని తలదన్నేలా ఈ మూవీ ఉండాలనేది రాజమౌళి ఆలోచన. దీనికోసం రాజమౌళి ఒక ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో టై అప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట ఇది కనుక జరిగితే హాలీవుడ్ లో ఈ చిత్ర బిజినెస్ లెక్కలు మారిపోతాయి. కనీవినీ ఎరుగని భారీ ప్రాజెక్ట్ అవుతుంది. హాలీవుడ్ స్టూడియో కన్ఫర్మేషన్ కోసం రాజమౌళి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఈ చిత్రం ఆలస్యం అవుతోందట. వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోంది. మహేష్ ఈ మూవీలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడిగా నటించబోతున్నాడు.