రెండు తెలుగు రాష్ట్రలను వరణ దేవుడు కమ్మేశాడు. ఎక్కడికక్కడ అన్ని స్తంభించేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దాంతో తెలుగు రాష్ట్రాలు అస్తవ్యస్తమయ్యాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. కనీసం తాగడానికి నీరు కూడా దొరకని దుస్థితి నెలకొంది. వందలాది ప్రజలు నిలువ నీడ లేకుండా అయిపోయారు. ఇళ్లన్నీ నీట మునగడంతో నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సహయక బృందాలు.. వరదలో చిక్కుకున్న వారికి ఎక్కడికక్కడే కాపాడి వారికి అన్నపానీయాలు అందిస్తూనే ఉన్నారు. వర్షం తగ్గినా వరద మాత్రం పోలేదు. కొన్నిచోట్ల హెలికాఫ్టర్‌తో సహాయక బృందాలు ఆహారాన్ని అందిస్తున్నారు, డ్రోన్ల సాయంతో.. పాలు నీరు, బ్రెడ్, బిస్కెట్లను చేరవేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగిన వరద పరిస్థితిని చూసి పలువురు సెలబ్రిటీలు చలించిపోయారు.
తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ కోటీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు అనౌన్స్ చేశాడు. అంతేకాకుండా ఓ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చాడు. '50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం.