ఆగస్టు 29 వ తేదీన మంచి అంచనాల నడుమ నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది.ఈ 11 రోజుల్లో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చాయి. మరి ఈ మూవీకి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 13.34 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.30 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.54 కోట్లు , ఈస్ట్ లో 1.90 కోట్లు , వెస్ట్ లో 1.29 కోట్లు , గుంటూరులో 1.75 కోట్లు , కృష్ణ లో 1.74 కోట్లు , నెల్లూరు లో 1.13 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 11 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 28.15 కోట్ల షేర్ , 46.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 11 రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 6.80 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 11.85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 11 రోజులకు గాను ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 46.80 కోట్ల షేర్ , 86.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మన్ కంప్లీట్ చేసుకుని 4.80 కోట్ల లాభాలను అందుకుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.