ప్రముఖ బెంగాలీ నటి మధుమితా సర్కార్ తృటిలో ప్రాణాలతో బయటపడింది. భూత్నాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు సోమవారం ఆమె తన కారులో బయల్దేరింది. ఆ సమయంలో ఓ కార్గో ట్రక్కు ఆమె కారును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో ఆమె తప్పించుకుంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ తప్పించుకునేందుకు యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.