ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతిపై సింగర్ సునీత ఫైర్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2019, 07:34 AM

ప్రముఖ తెలుగు సింగర్ సునీతపై తరచూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడం, అందంగా ఉండటం, ఇండస్ట్రీలో పాపులర్ పర్సన్ కావడం ఇందుకు కారణం అయుండొచ్చు. సునీత కూడా తనపై వచ్చే రూమర్స్ పెద్దగా పట్టించుకోదు. తన మనసుకు చాలా బాధ కలిగించే అశాలపై తప్ప ఆమె రియాక్ట్ అవ్వరు. ఆ మధ్య తాను మరో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాజాగా ఆమె స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాటలను ఖండిస్తూ పోస్ట్ పెట్టారు.ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ... తన వద్దకు సినీ ప్రముఖులు వస్తుంటారని... చిరంజీవి, రజనీకాంత్ వచ్చారని, రాజేంద్రప్రసాద్ అబ్బాయి జగదీష్ వస్తుంటారు, సింగర్ సునీత కూడా వస్తుంటారని వ్యాఖ్యానించారు. తాను రాకున్నా తన పేరు చెప్పడంతో సునీతకు కోపం వచ్చింది.


‘రోజూ ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కానీ అన్నింటిపై స్పందించాలని అనుకోము. కానీ కొన్ని విషయాలపై తప్పకుండా స్పందించాలి. స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి ప్రముఖ వ్యక్తి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు చేర్చడం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో... ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనే ఈ పోస్టు పెడుతున్నాను, నేను అతడిని కలవక పోయినా ఎందుకు ఇలా చెబుతున్నారో తెలియదు' అంటూ సునీత వ్యాఖ్యానించారు.ఈ విషయంలో సునీతకు మద్దతుగా పలువురు అభిమానులు స్పందించారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేస్తే ఇంకా చాలా మంది పేర్లు చెప్పి బతికేస్తుంటారు. మీరు సరైన విధంగా కౌంటర్ ఇచ్చారు. మీకు మేము మద్దతుగా ఉన్నాం... అంటూ వ్యాఖ్యానించారు.


సునీత చేసిన ఈ పోస్టుపై రకరకాల చర్చ జరుగుతోంది. స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి వారు తన వద్దకు రాకున్నా... సునీత పేరు ఎందుకు వాడినట్లు? ఆయన ఈ వివాదంపై ఎలా స్పందించబోతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. అయితే స్వారూపానంద చెప్పింది సింగర్ సునీత పేరు అయి ఉండక పోవచ్చని మరికొందరి వాదన.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa