బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణల కేసును పోలీసులు క్లోజ్ చేసేసారు. హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ వంటి ఇతర సినిమా పరిశ్రమలకూ వ్యాపించింది. 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలో ఓ సాంగ్‌లో నటిస్తున్నప్పుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆయనపై ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టింది.బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం మొదలైంది ఈ ఉదంతంతోనే.. తర్వాత పలువురు ప్రముఖులు కూడా ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు.. మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న దర్శుకులు, నటులను సినిమాలనుండి బహిష్కరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.నానాపై తనశ్రీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని, తమకు ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని, ముంబై పోలీసులు కేసును క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు.. అయితే పోలీసులు సాక్షుల దగ్గరినుండి సరైన వాంగ్మూలం తీసుకోకుండానే కేసును క్లోజ్ చేస్తున్నారని తనుశ్రీ దత్తా లాయర్ ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa