ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంగ్ టాక్: చాలా రోజుల తర్వాత మనసు మెచ్చే పాట

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2019, 12:03 PM

చాలా తక్కువ టైం లో యువతలో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరు అంటే కచ్చితంగా 'విజయ్ దేవరకొండ' ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు. యూత్ కి నచ్చే సినిమాలు  చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యువ హీరో.ఇప్పుడు అందరూ విజయ్ నుంచి వస్తున్న 'డియర్ కామ్రేడ్' సినిమా కోసం వేచి చూస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది. ఆల్రెడీ 'గీత గోవిందం'తో భలే జోడీ అనిపించుకున్న జంట కావడంతో, ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. 

తాజాగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. "గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా .., అలుపెరుగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరుగ లేదులే" అంటూ ఈ పాట సాగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం ..  గౌతమ్ భరద్వాజ్ - యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. వచ్చేనెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa