వివాదాస్పద దర్శక నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే! ఇవాళ ఆయన పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉండింది. కానీ వర్మ గైర్హాజరయ్యారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా రామ్‌గోపాల్‌వర్మ వ్యవహరించారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో టీడీపీ నాయకుడు ఒకరు కంప్లయింట్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే తనపై నమోదైన కేసును కోట్టేయాలంటూ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ చేయడానికి ఏపీ హైకోర్టు నిరాకరిచింది.విచారణను వాయిదా వేయాలని వర్మ కోరారు. ఆ విన్నపాన్ని పోలీసులకే చేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తాను విచారణకు హాజరు కాలేనని మద్దిపాడు పోలీసులకు వర్మ సమాచారం ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని చెప్పారు. తనకు నాలుగు రోజులు సమయం కావాలని కోరారు. నాలుగు రోజుల సమయం దొరికితే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే అవకాశం వర్మకు లభిస్తుంది.