మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. "శివుడి పరమ భక్తుడి కథ తెలుసుకునేందుకు సిద్ధంకండి’’ అని సోషల్ మీడియాలో పోస్టర్ షేర్ చేసి వెల్లడించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వివిధ భాషల సినీ ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్‌బాబు, శరత్‌కుమార్, మధుబాల, ముఖేష్‌రిషి, దేవరాజ్, ఐశ్వర్యా భాస్కరన్ తదితరులు నటిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు