ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైన సమయంలో ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. వర్మ సోషల్‌మీడియా అకౌంట్స్ హ్యండిల్స్ అన్నీ హైదరాబాద్‌లో చూపిస్తున్నట్టు సమాచారం. వర్మ ఆచూకీ కోసం ఒంగోలుకు చెందిన రెండు పోలీసు బృందాలు గాలింపు చేపట్టినట్టు తెలుస్తోంది. శంషాబాద్, షాద్‌నగర్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూరు (తమిళనాడు)లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకు వెళ్లకపోవడంతో వారు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వచ్చారు. కాగా, ఆర్జీవీ నిన్న హీరో మోహన్ లాల్‌ను కలిసిన ఫోటోను ఎక్స్‌లో పోస్టు పెట్టారు. షూటింగ్ కోసం ఆయన తమిళనాడు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంటికి రావడంపై ఆర్జీవీ అడ్వకేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.