కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలో మానేసి రాజకీయల్లోకి వెళ్లడం.. అజిత్ సినిమాలు కాకుండా రేసింగ్‌లపై దృష్టి పెట్టడంతో ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు అని తమిళ సినీ ఇండస్ట్రీలో చాలరోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ అంచనాలను పెంచుతూ నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు శివ కార్తికేయన్. ఇండస్ట్రీలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం కోలీవుడ్‌లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శివ. రీసెంట్‌గా అతడు నటించిన అమరన్ చిత్రం కూడా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడంతో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ తర్వాత ఆ రేంజ్ ఉన్న అగ్ర హీరోల జాబితాలో చేరాడు. అయితే ఈ నటుడు ప్రస్తుతం ఉన్న యువత సోషల్ మీడియా వాడోద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్ట్‌వల్‌లో ముఖ్య అతిథిగా పాల్గోన్న శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న యూత్‌కి ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండండి. ముఖ్యంగా ట్విట్టర్(ఎక్స్)కి చాలా దూరంగా ఉండండి. ఈ విషయం చెప్పినందుకు ఎలాన్ మస్క్ నన్ను బ్లాక్ చేసిన సరే. కొన్ని ఏండ్లుగా నేను ఇదే ఫాలో అవుతున్నాను. సాధారణంగా నా సినిమా ఎప్పుడైన పరజయం పొందింతే సోషల్ మీడియాలో చూసి తప్పులు సరి చేసుకునేవాడిని. అయితే ఈ మధ్య సోషల్ మీడియా వాడుతుంటే ఫెయిల్ అయిన సినిమాలకు ఫలితం ఇవ్వకపోగా నెగటివిటీని మరింత పెంచిందని చెప్పుకొచ్చాడు. నేను టీవీ యాంకర్‌గా ఉన్నప్పుడు ఇంటర్ నెట్ ఎక్కువ లేకుండేది. అప్పుడు నేను ఏమైన తప్పులు చేస్తున్నానా అని ఫీడ్ బ్యాక్ తీసుకునే వాడిని. కానీ ఇప్పుడు ఎక్స్‌లో అలా లేదు. అందుకే బ్యాక్ టు బేసిక్స్ (మూలాల్లోకి వెళ్లి నేర్చుకోవడం) సూత్రాన్ని పాటించాను. దీంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాను అంటూ శివ చెప్పుకోచ్చాడు.