నటి కీర్తిసురేశ్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలోనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం స్వయంగా వెల్లడించారు. కీర్తి తన కుటుంబసభ్యులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెళ్లి ముచ్చట బయటపెట్టారు. వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. గోవాలో వెడ్డింగ్ జరుగుతుందన్నారు. ఇక, తాను నటిస్తున్న హిందీ సినిమా కూడా వచ్చే నెలలో విడుదల కానుందని, అందుకే స్వామివారి దర్శనం కోసం వచ్చానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa