ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాహితి దాసరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన "ఫియర్" టీమ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 04:58 PM

ప్రఖ్యాత నటి వేదిక రచయిత్రి-దర్శకురాలు హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్న మహిళా-కేంద్రీకృత హారర్ థ్రిల్లర్ లో కనిపించనుంది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ "ఫియర్" అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి విశేషమైన బజ్‌ను సృష్టిస్తోంది. "ఫియర్" యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ వీక్షకుల నుండి ఆసక్తిని పొందింది. ఇటీవలే మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా యొక్క తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం వెర్షన్ టీజర్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సాహితి దాసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ప్రతిష్టాత్మకమైన దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై AR అభి మరియు సహనిర్మాత సుజాత రెడ్డి నిర్మించిన ఈ సిఎంమా వివిధ భారతీయ భాషలలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా, ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa