ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజాసాబ్ స్పెషల్‌ సాంగ్‌‌లో నయన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 07:41 PM

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘రాజాసాబ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ కథానాయికలు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంట్లో ఓ ప్రత్యేక గీతం ఉండనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే  . ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి నయనతార  ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో పాటను చిత్రీకరించే అవకాశముంది. ప్రభాస్‌ - నయన్‌ చివరిగా 2007లో వచ్చిన ‘యోగి’లో జంటగా నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ‘రాజాసాబ్‌’తో  తిరిగి కలవనున్నారు. వినోదం నిండిన హారర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ చిత్ర తొలి గీతం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com