ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఫియర్’ చిత్రం నుంచి లేటెస్ట్ అప్డేట్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 07:46 PM

అందాల భామ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఫియర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని, వీడియో గ్లింప్స్‌ల వరకు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుండి ఓ లేటెస్ట్ అప్డేట్‌ని వదిలారు మేకర్స్.‘ఫియర్’ సినిమా నుండి టైటల్ సాంగ్‌ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునే ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో వేదిక తనదైన మార్క్ వేసుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.ఈ సినిమాను డా.హరిత గోగినేని డైరెక్ట్ చేయగా.. డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14 న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com