ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండ్రోజుల్లో రూ.449 కోట్లతో మరో ఆల్ టైమ్ రికార్డు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 08:28 PM

తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటిచెబుతున్న చిత్రం పుష్ప-2 ది రూల్. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు రూ.294 కోట్లతో భారతీయ సినీ చరిత్రలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన పుష్ప-2... రెండ్రోజుల్లో రూ.449 కోట్లతో మరో రికార్డు సెట్ చేసింది. రెండ్రోజుల్లోనే ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రం మరొకటి లేదు. అత్యంత వేగంగా రూ.449 కోట్లు కొల్లగొట్టిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప-2 చరిత్ర సృష్టించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com