టాలీవుడ్ నటుడు నారా రోహిత్ ఒకప్పుడు మంచి కంటెంట్ ఉన్న కొన్ని సెన్సిబుల్ సినిమాలు చేసిన నటుడు. అయితే ఇండస్ట్రీకి దూరమై సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత 'ప్రతినిధి 2' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా ముగిసింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జెమినీ టీవీ ఛానల్ లో డిసెంబర్ 15న మద్యహ్నం 12 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ప్రతినిధి 2 ఫ్లాప్ అయినప్పటికీ, నారా రోహిత్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సిరీ లెల్లా హీరోయిన్‌గా నటించగా, దినేష్ తేజ్, ఇంద్రజ, ఉదయబాను, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa