అశోక్ గల్లా నటించిన తన రెండవ చిత్రం 'దేవకి నందన వాసుదేవ' భారీ అంచనాల మధ్య నవంబర్ 22న విడుదల అయ్యింది. గుణ 369 చిత్రానికి దర్శకత్వం వహించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తాజాగా ఇప్పుడూ ఈ సినిమాలోని బంగారం వీడియో సాంగ్ ని ఈరోజు అంటే డిసెంబర్ 9న మధ్యాహ్నం 4 గంటలకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఝాన్సీ, సంజయ్ స్వరూప్, శ్రావణ్ రాఘవేంద్ర, శత్రు కీలక పాత్రలలో నటిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ("హను-మాన్") కథ అందించగా, ప్రశంసలు పొందిన సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. సినిమా సౌండ్‌ట్రాక్‌ను భీమ్స్ సిసిరోలియో స్వరపరచగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల మరియు రసూల్ ఎల్లోర్ హ్యాండిల్ చేశారు. తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌పై సోమినేని బాలకృష్ణ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa