బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ కి "డాకు మాహారాజ్" అనే టైటిల్ ని లాక్ చేసారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టైటిల్ టీజర్ ఆయన అభిమానులను, సినీ ప్రియులను ఉర్రూతలూగించింది. ఇప్పటికే ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌గా ఉంటుందని బాలకృష్ణ తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. తాజాగా ఇప్పుడు బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 15 డిసెంబర్ 2024 నుండి సినిమా విడుదలకు ముందే సినిమా ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మరియు హైప్‌ని సృష్టించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, చాందిని చౌదరి, రిషి, టామ్ చాకో మరియు ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 12, 2025న విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమా పతాకంపై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.