టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ డిసెంబర్ 20, 2024న విడుదల కానున్న 'బచ్చల మల్లి' సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించారు. ఇటీవలే మేకర్స్ విడుదలకి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 14న అంటే ఈరోజు మధ్యాహ్నం 4:05 గంటలకి టాలీవుడ్ నటుడు నాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకి సంగీత స్వరకర్త. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.