కింగ్ నాగార్జున ప్రస్తుతం `మన్మథుడు 2` చిత్రీకరణను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరో సీక్వెల్‌లో నటించబోతున్న సంగతి తెలిసిందే. 2016లో నాగార్జున నటించిన `సోగ్గాడే చిన్ని నాయనా` సినిమాకు సీక్వెల్‌గా `బంగార్రాజు` రూపొందనుంది. కల్యాణ్ కృష్ణ తెరకెక్కించబోయే సీక్వెల్‌లో నాగార్జున, నాగచైతన్య తాతా మనవడిగా నటిస్తారని వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రంలో నాగ్ కుర్ర హీరోయిన్ సరసన నటించనున్నారని టాక్. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగార్జున సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. అలాగే `మన్మథుడు 2`లోనాగార్జున సరసన నటించిన కీర్తిసురేశ్, బంగార్రాజులో చైతన్య జోడిగా నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa