డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ద లయన్ కింగ్’. 1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దలను, పిల్లలను విశేషంగా ఆకట్టుకునే ఈ చిత్రానికి ఆయా భాషల్లో టాప్ హీరోలు, కమెడియన్‌లు వాయిస్ ఇవ్వడం విశేషం. ఇక తెలుగులో జగపతి బాబు, రవిశంకర్, నాని, బ్రహ్మానందం, అలీ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. దానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. దానిపై మనం ఓ లుక్కేద్దాం!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa