సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. బన్నీ బెయిల్ రద్దు కోసం హైదరాబాద్ పోలీసులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలిసింది. సంధ్య థియేటర్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని పోలీసుల లేఖ ఒకటి నిన్న బయటకి వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు హైకోర్టులో వాదనలు వినిపించనున్నట్లు తెలిసింది. బెయిల్ రద్దు అయితే బన్నీ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశముంది.