రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన భారీ అంచనాల చిత్రం 'UI' మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఉపేంద్ర దర్శకుడు మరియు ప్రధాన నటుడి పాత్రలు పోషించాడు. ఈ సినిమా యొక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని గీత ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క తెలంగాణ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌లపై ఈ పాన్-ఇండియన్ ప్రొడక్షన్ ని జి మనోహరన్ మరియు కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.