1978లో వచ్చిన 'శివరంజని' సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమని మోహన్ బాబు తెలిపారు. తన గురువు దాసరి నారాయణరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని చెప్పారు. ఇప్పటికీ ఈ సినిమా శక్తివంతమైన భావోద్వేగాలను రేకెత్తిస్తూనే ఉంటుందని అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందని.... దాదాపు ఏడాది పాటు థియేటర్లలో ఆడిందని మోహన్ బాబు చెప్పారు. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఐకానిక్ గా ఉంటాయని తెలిపారు. తెలుగు చిత్రసీమలో ఈ సినిమా ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయిందని చెప్పారు. ఈ చిత్రంలో జయసుధ ప్రధాన పాత్రలో నటించారు. హరిప్రసాద్, మోహన్ బాబు, నిర్మలమ్మ కీలక పాత్రలను పోషించారు.