అనుష్క శెట్టి పరిశ్రమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది. 2005లో విడుదలైన సూపర్ ఆమె డెబ్యూ మూవీ. ఈ సినిమా ఆడిషన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన అనుష్క శెట్టి హీరో నాగార్జునకు విపరీతంగా నచ్చేసిందట. ఆ అమ్మాయి ఎవరో బాగుంది ఎంపిక చేయ్ అని, దర్శకుడు పూరి జగన్నాధ్ కి సూచించాడట. అనుష్క శెట్టి పరిశ్రమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది. 2005లో విడుదలైన సూపర్ ఆమె డెబ్యూ మూవీ. ఈ సినిమా ఆడిషన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన అనుష్క శెట్టి హీరో నాగార్జునకు విపరీతంగా నచ్చేసిందట. ఆ అమ్మాయి ఎవరో బాగుంది ఎంపిక చేయ్ అని, దర్శకుడు పూరి జగన్నాధ్ కి సూచించాడట. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో ఆమె జతకట్టారు. అటు తమిళంలో కూడా రాణించింది. అనుష్క కెరీర్లో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు మైలురాయిగా నిలిచిపోయాయి. దేవసేన పాత్రలో అనుష్క ప్రేక్షకులను మెప్పించింది. యువరాణిగా, వృద్దురాలిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది. బాహుబలి సక్సెస్లో అనుష్కకు కూడా భాగం ఉంది. అనుష్క వివాదరహితులు. పరిశ్రమలో ఆమెను మంచి పేరుంది. అదే సమయంలో అనుష్క పై పలు రూమర్స్ ఉన్నాయి. ముఖ్యంగా హీరో ప్రభాస్ ని ప్రేమిస్తున్న అనుష్క.. పెళ్లి చేసుకోనుందని కథనాలు వెలువడ్డాయి. బాహుబలి 2 అనంతరం అనుష్క-ప్రభాస్ వివాహం చేసుకుంటున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ఈ పుకార్లను ప్రభాస్, అనుష్క ఖండించారు. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని స్పష్టత ఇచ్చారు.
కాగా అనుష్క గతంలో ఎఫైర్ రూమర్స్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది. జయప్రద హోస్ట్ గా ప్రసారమైన టాక్ షో జయప్రదంలో అనుష్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నీపై వచ్చిన అతిపెద్ద రూమర్ ఏమిటని.. అనుష్కను జయప్రద అడిగింది. ఈ ప్రశ్నకు అనుష్క తడుముకోకుండా సమాధానం చెప్పింది. కాగా అనుష్క గతంలో ఎఫైర్ రూమర్స్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది. జయప్రద హోస్ట్ గా ప్రసారమైన టాక్ షో జయప్రదంలో అనుష్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నీపై వచ్చిన అతిపెద్ద రూమర్ ఏమిటని.. అనుష్కను జయప్రద అడిగింది. ఈ ప్రశ్నకు అనుష్క తడుముకోకుండా సమాధానం చెప్పింది.
నాకు ఐదుసార్లు పెళ్లి అయిపోయింది.. అన్నారు. ఎవరెవరితో అని జయప్రద అడిగారు. నాతో పని చేసిన కో స్టార్స్ తో అని అనుష్క అన్నారు. ఎవరెవరు అని జయప్రద అడిగారు. సుమంత్, గోపీచంద్, ప్రభాస్, సెంథిల్ తో పాటు మరొకరి తో తనకు పెళ్లి అంటూ, ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వెలువడ్డాయని అనుష్క వెల్లడించారు. కెరీర్ బిగినింగ్ లో అనుష్క... సుమంత్, గోపీచంద్ లతో కూడా నటించారు. గోపీచంద్-అనుష్క ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లపై అనుష్క స్పందించలేదు. అలాగే రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ సెంథిల్ కుమార్ తో అనుష్క పెళ్లి అని కూడా వార్తలు వచ్చాయి. అనంతరం సెంథిల్ కుమార్ వివాహం జరిగింది. ఈ పెళ్ళికి అనుష్క కూడా హాజరైంది.