గత కొన్ని వారాలు నుంచి మన తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి పలు ఊహించని ఘటనలే జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన ఒకటి కాగా..ఇది కాకుండా దీనికి ముందే స్టార్ట్ అయ్యిన ఘటన ఏది అంటే అది ఖచ్చితంగా మంచు వారి కుటుంబం గొడవలు అని చెప్పాలి.కాగా మంచు వారి ఇంట ఇపుడు నడుస్తున్న కాంట్రవర్సీలో ఒక్క మంచు లక్ష్మి తప్ప మిగతా కుటుంబీకులు అంతా కూడా ఈ ఇష్యూ పైనే మాట్లాడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో రీసెంట్ గానే మోహన్ బాబు మీడియా వారిపై దాడి చేయడం అనంతరం వారి దగ్గరకి వెళ్లి పరామర్శించడం కూడా జరిగింది. కానీ వారి ఇంట్లో మాత్రం మంచు మనోజ్ ఒక్కడూ ఒక వైపు మిగతా అంతా ఒకవైపు అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈ క్రమంలో మంచు విష్ణు మరియు మంచు మనోజ్ నడుమ వాగ్వాదాలు ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. గత కొన్ని వారాలు కితమే మంచు మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు తన ఇంటికి వచ్చి జెనరేటర్ లో పంచదార పోసి కరెంట్ కట్ చేసాడు అంటూ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ అదంతా తప్పుడు ఆరోపణలు అని మంచు విష్ణు పై తన చిన్న కొడుకు కావాలనే ఇలా ఆరోపణలు చేస్తున్నాడు అంటూ తన తల్లి మంచు నిర్మల రివర్స్ లో కంప్లైంట్ చేయడం షాకిచ్చింది.
అయితే ఇపుడు లేటెస్ట్ గా మరో షాకింగ్ ట్విస్ట్ మంచు కుటుంబంలో వచ్చింది. ఈసారి ఏకంగా తన అన్నయ్య మంచు విష్ణు నుంచి నాకు ప్రాణ హాని ఉందంటూ మంచు మనోజ్ కంప్లైంట్ చేసాడట. మంచు విష్ణు సహా మరో వ్యక్తి పేరు కూడా తాను పెట్టినట్టుగా తెలుస్తుంది. అతడు వినయ్ అంటూ ఇద్దరి పేరిట పోలీసులకి మనోజ్ కంప్లైంట్ చేసాడట. దీనితో ఈ షాకింగ్ వార్తలు ఇపుడు ఊపందుకున్నాయి.మరి కారణాలు ఏమైనప్పటికీ మాత్రం ఇపుడు వీరి కుటుంబ గొడవల్లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు టర్నింగ్ లు చోటు చేసుకుంటున్నాయి. మరి చూడాలి మంచు వారి కలహాలు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాయో అనేది. ఇక మంచు విష్ణు ఇపుడు తన కెరీర్‌లోనే భారీ పాన్ ఇండియా చిత్రం "కన్నప్ప" లో బిజీగా ఉండగా ఆ సినిమా పనులు ఓ పక్క ఈ గొడవలు మరోపక్క హ్యాండిల్ చేస్తున్నాడు.అలాగే ఈ సినిమాని మంచు మోహన్ బాబే స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక మంచు విష్ణు కూడా ఈ గొడవలు కాకుండా పలు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో రీసెంట్ గానే భైరవం అనే సినిమాలో తాను జాయిన్ అయ్యాడు. ఇక మంచు లక్ష్మి అయితే ఈ గొడవలపై కనీసం ఎలాంటి స్పందన చూపించకుండా పీస్ ఫుల్ గా సోషల్ మీడియాలో తన స్టేటస్ లు పెట్టుకుంటుంది.