తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడు. తమ్ముడ్ని తలచుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక నటించిన ‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే జీవిత, రాజశేఖర్.. తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం కాగా, స్టేజ్ కింద ఉన్న ఆనంద్ దేవరకొండ, వాళ్ళ తల్లి కూడా కన్నీరు మున్నీరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa