ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప-2 చిత్రానికి మరో 20 నిమిషాల పవర్ ఫుల్ ఫుటేజిని జోడిస్తున్నారు

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 07, 2025, 08:40 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సంక్రాంతి ముందే వచ్చేసింది. పుష్ప-2 చిత్రానికి మరో 20 నిమిషాల పవర్ ఫుల్ ఫుటేజిని జోడిస్తున్నారు. దాంతో ది వైల్డ్‌ఫైర్‌ మరింత ఎక్స్‌ట్రా ఫైరీగా మారబోతోందని చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ పవర్ ఫుల్ రీలోడెడ్ వెర్షన్ జనవరి 11 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ మేరకు మేకర్స్... అల్లు అర్జున్ చేతిలో గొడ్డలితో ఉగ్రరూపంతో ఉన్న ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా పంచుకున్నారు.అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో డిసెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయం నమోదు చేసింది. భారతీయ సినీ రికార్డులను తిరగరాస్తూ మరో చరిత్రను సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్‌ నెంబర్‌వన్‌ ఫిల్మ్‌గా 'పుష్ప-2' ది రూల్‌ నిలిచింది. ఈ క్రమంలో 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో రూ.1,831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్ఠించింది.  ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డులు సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తోంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa