వందకుపైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన ధర్మ ఇప్పుడు నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సంహారం’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఆదిత్య, కవిత మహతో హీరోహీరోయిన్లుగా నటించారు. ఇంతవరకూ 44 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన సాకేత్ సాయిరామ్ ఈ సినిమాలో విలన్‌గా నటించడం విశేషం. చిత్రానికి సంగీత దర్శకుడు కూడా ఆయనే. తనకు, తన అక్కకు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఓ యువతి తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో దుష్ట సంహారం ఎలా జరిపిందన్నదే ఈ చిత్రకథ అని ధర్మ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa