టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం గతేడాది క సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం దిల్‌రుబా సినిమాలో నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే కొత్త సినిమా ప్రకటించేశాడు కిరణ్ అబ్బవరం.మజాకా సినిమాకు తెరకెక్కిస్తున్న హస్య మూవీస్ బ్యానర్‌లో కొత్త సినిమా ప్రకటించాడు. ఈ సినిమా కిరణ్ అబ్బవరానికి 11వది కాగా.. హాస్య మూవీస్‌కు ఏడో సినిమా. అంతేకాదు ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు ఉదయం 8:15 గంటలకు రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దర్శకుడు, టైటిల్‌తోపాటు నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై రేపు క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa