‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన రుద్ర పాత్రలో నటిస్తున్నారు. ‘‘ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు’’ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన లుక్‌ను షేర్ చేశారు. ‘‘శక్తికి.. వివేకానికి ప్రతీక అయిన రుద్ర పాత్రను పోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేమ, భక్తి, త్యాగంతో నిండిన ఈ సాహసోపేత ప్రయాణాన్ని థియేటర్లో చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అని తెలిపారు. మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేశ్‌కుమార్ దర్శకత్వంలో డా.మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa