పాపులర్ సెలబ్రిటీస్ ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా తక్కువ టైమ్‌లోనే ఫ్యాన్స్‌కి తెలిసిపోతాయి. ఫేవరెట్ హీరో ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉందంటే, అభిమానులు చాలా సందడి చేస్తారు. అదే సమయంలో కుటుంబంలో ఏవైనా వివాదాలు జరిగితే, మీడియా కూడా అంతే రేంజ్‌లో ఫోకస్ చేస్తుంది. ఇలా ఒక టాప్ టాలీవుడ్ హీరో కుటుంబ పరువును తన కూతురు మంటగలిపితే, మీడియా అంతకంటే ఎక్కువ రచ్చ చేసింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. మనం మాట్లాడుకుంటున్నది మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఇన్సిడెంట్ గురించి అని.మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 150కు పైగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులు, రివార్డులను అందుకున్నాడు. కొన్నాళ్లపాటు రాజకీయాల్లోనూ మెరిశారు. ప్రొఫెషనల్ కెరీర్‌లో తనకెలాంటి ఒడుదొడుకులు పెద్దగా లేనప్పటికీ వ్యక్తిగత జీవితంలోనే చిరంజీవి కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా, చిన్న కూతురు విషయంలో మెగాస్టార్ కొంత ఇబ్బంది పడ్డారు. ఆనాటి నుంచి శ్రీజ గురించే చిరంజీవి బెంగంతా. శ్రీజ జీవితంలో జరుగుతున్న ఘటనలే ఇందుకు కారణం.అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్న చిరంజీవికి.. సుష్మిత, రామ్ చరణ్, శ్రీజ సంతానం. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని రామ్ చరణ్ తెచ్చుకున్నాడు. మరోవైపు, చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తూ రీసెంట్‌గానే మూవీ ప్రొడక్షన్‌లోకి అడుగు పెట్టింది. ఇక, చిన్న కూతురు శ్రీజ మాత్రం ప్రైవేట్ జీవితాన్ని గడుపుతుంటుంది.శ్రీజ జీవితంలో ఎన్నో మరచిపోలేని ఘటనలు ఉన్నాయి. 19 ఏళ్ల వయసులోనే తండ్రిని, కుటుంబాన్ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకుంది. బాయ్‌ఫ్రెండ్ శిరీష్ భరద్వాజ్‌తో 2007లో హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదు. పైగా, మైనర్ అయిన తన కూతుర్ని కిడ్నాప్ చేశారని శిరీష్‌పై చిరంజీవి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారని హిందూస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది. దీంతో తమ ఫ్యామిలీ నుంచి తమకు ముప్పు పొంచి ఉందని శ్రీజ మీడియాతో చెప్పడం అప్పట్లో కలకలం రేపింది.పెళ్లయిన ఏడాది తర్వాత శ్రీజ, శిరీష్ దంపతులకు ఒక కూతురు పుట్టింది. ఈ బిడ్డకు నివృతి అనే పేరు పెట్టారు. అయితే, కొన్నేళ్ల తర్వాత వీరి దాంపత్యంలో సమస్యలు మొదలయ్యాయి. క్రమంగా అవి తీవ్రం కావడంతో వరకట్న వేధింపుల కింద తన భర్తపై శ్రీజ ఫిర్యాదు చేసింది. అనంతరం, 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.విడాకుల తర్వాత శ్రీజ తిరిగి తన పుట్టింటికి రాగా, శిరీష్ మాత్రం రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ దేవ్‌ని కుటుంబ పెద్దల సమక్షంలో శ్రీజ పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. మరోవైపు, కళ్యాణ దేవ్ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య మనస్ఫర్దలు వచ్చాయని 2022 నుంచి రూమర్లు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రాంలో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. గత కొన్ని రోజులుగా కళ్యాణ్ దేవ్ కూడా తన కూతురితో దిగిన ఫొటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. చాలా సార్లు శ్రీజ లేని ఫొటోలనే పోస్ట్ చేస్తుండటంతో వీరిద్దరూ సపరేటుగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికైతే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు, శ్రీజ తన తండ్రి ప్రొఫెషనల్ కెరీర్‌కి ఆసరాగా ఉంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa