సమంత అంటేనే ఓ సంచలనం. సినిమాలు చేసినా చేయకపోయినా ఏదో ఒకరకంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సౌత్ ఇండియాలో సమంత క్రేజీ వేరే లెవెల్. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా చేరువవుతున్న సామ్.. తన రెండో పెళ్లి విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ ఫాలోయింగ్ ఉన్న సమంత.. ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆమె ఎస్ అనాలే గానీ బోలెడంత మంది దర్శకనిర్మాతలు క్యూ కడతారు కానీ, అవకాశాల విషయంలో సమంత మాత్రం చాలా సైలెంట్ అయింది.మరోవైపు చాలా కాలంగా మీడియాకు కూడా దూరంగా ఉంటున్న సామ్.. ఈ మధ్యే తిరిగి యాక్టీవ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. సమంత పెడుతున్న సందేశాలు చూసి ఆమె రెండో పెళ్లికి సైద్దమైందనే హింట్స్ ఇస్తోందని జనం చెప్పుకుంటున్నారు.నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటున్న సమంత, రీసెంట్ గా మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉండనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది.ఈ పరిస్థితుల నడుమ తాజాగా సమంత పెట్టిన ఓ పోస్ట్, ఆమె రెండో పెళ్లిపై అనుమానాలు రెట్టింపు చేసింది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత భావాలను పంచుకోవడంలో ఎప్పుడూ వెనుకాడని సమంత, తాజాగా షాకింగ్ పోస్ట్ చేసింది."If I lose my shit, promise not to laugh / If I throw a fit and get photographed / Would you take my side? Would you hold my hand?" అంటూ సమంత పోస్ట్ పెట్టింది. నిన్ను ప్రేమించాలంటే భయమేస్తోంది, జీవితాంతం నా చెయ్యి పట్టుకొనే ఉంటావా..? అనేది దీని అర్థం.ఈ పోస్టును బట్టి చూస్తే సమంత తన రెండో పెళ్లి విషయంలో కాస్త ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రేమలో ఎంతో బాధ పడ్డాను కాబట్టి ఇకనైనా అలాంటి పెయిన్ వద్దు అనే కోణంలోనే సమంత ఈ పోస్ట్ పెట్టిందని జనం తీవ్ర చర్చల్లో మునిగిపోయారు.మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తోంది సమంత. ఇకపై తాను చాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది సమంత. సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా అలోచించి నిర్ణయం తీసుకుంటానని, తొందరపాటు ఉండదని చెప్పింది సామ్.టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే అక్కినేని వారింటికి కోడలిగా వెళ్ళింది సమంత. నాగ చైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. నాలుగేళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం, ఆ వెంటనే మాయోసైటిస్ అనే వ్యాధి బారినపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో సమంత రెండో పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa